Home తాజా వార్తలు ఘనంగా చత్రపతి శివాజీ మహారా జ్ జయంతి

ఘనంగా చత్రపతి శివాజీ మహారా జ్ జయంతి

by Telangana Express

ఆయుధం పట్టే హక్కు లేదన్న బ్రాహ్మణ దురహంకారాన్ని చరిత్రలో మొదటిసారి ధిక్కరించిన దేశాలీ

చత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో నేటి మతోన్మాదులకు బుద్ధి చెబుదాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

మంచిర్యాల, ఫిబ్రవరి 19, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలను మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరం అశోక్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ సూద్ర రాజ్య నిర్మాత1630 పిబ్రవరి 19న జన్మించారని, చిన్నప్పటినుండి యుద్ధ విద్యలు వినేర్చుకొని, దక్కని సుల్తానులు మొగల్ సామ్రాట్యులకు భిన్నంగా రాజ్యం ఏర్పాటు చేయాలనుకోన్నారు. 16 వ యుక్త వయసులోనే 1664 లొ మరాఠా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసే వరకు శివాజీ పోరాటం కొనసాగింది. శివాజీకి కులం, మతం అనే పట్టింపులు లేవు. సైన్యంలో అన్ని కుల, మతాలవారు ఉన్నారు. శూద్రులకు అతిశూద్రులకు ఆయుధం పట్టే హక్కు, రాజ్యంలో కీలక పదవులు కట్టబెట్టాడు. రైతులకు భూమి మీద హక్కు కల్పించాడు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, రైతు సంఘం నాయకులు కే లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుడ్ల రాజన్న,మగ్గిడి జయ, ములకల రాజన్న తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment