Home తాజా వార్తలు ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

by Telangana Express

ముధోల్:19ఫిబ్రవరి(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండలంలోని చించాల గ్రామంలో శ్రీరామ సేన ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి పూజలను చేశారు.అనంతరం పలువురు యువకులు మాట్లాడుతూ చత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు. ఈ పేరు వింటేనే భరతావణి పులకించిపోతుందన్నారు.మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠ యోధు డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్ర మంలో లో శ్రీ రామ్ సేన అధ్యక్షుడు తునుకుల శ్రావణ్ ,భజరంగ్ యూత్ అధ్యక్షుడు సర్వేశ్, యవకులు పెసర సాయినాథ్ గౌడ్, కన్నో ల్ల చరణ్, గట్టుపెళ్లి రంజిత్ , గట్టుపెళ్లి రాజశేఖర్, గోనె వెంకటి, పెక్కంటి అంజు, సక్కరి శ్రీకాంత్, సునయ్ ,రాము, ప్రశాం త్,రాజు, రాహుల్,యోగి పాల్గొన్నారు

You may also like

Leave a Comment