Home తాజా వార్తలు గ్రూప్ -2 పరీక్షలకు ఆలస్యంగా వచ్చారు.. “వెనక్కి” పంపారు

గ్రూప్ -2 పరీక్షలకు ఆలస్యంగా వచ్చారు.. “వెనక్కి” పంపారు

by Telangana Express

పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రారంభమైన గ్రూప్-2 పరీక్షలు

మిర్యాలగూడ డిసెంబర్ 15 (తెలంగాణ ఎక్స్ప్రెస్)
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ర్ట వ్యాప్తంగా ఆదివారం గ్రూపు -2 పరీక్షలు పక్కాడ్బందీ ఏర్పాట్ల నడుమ ప్రారంభమయ్యాయి. మిర్యాలగూడ పట్టణం, మండలంలోని 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులకు మెటల్ డిటెక్టర్ తో తనిఖీలు చేసిన తదుపరి కేంద్రంలోకి అనుమతించారు.పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులు ఉదయం 9:30 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలనే నిబంధన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టారు. ఉదయం 9:30 కు “ఒక్క నిమిషం” దాటిన పరీక్ష కేంద్రం లోపటికి పంపడం జరగదని నిబంధన ఉన్న విషయాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ విస్తృత ప్రచారం నిర్వహించి సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసింది. అయినప్పటికీ మిర్యాలగూడ పట్టణంలోని మీనా ఇంజనీరింగ్ మహిళా కళాశాల పరీక్ష కేంద్రం వద్ద 9:30 గంటలు దాటిన తదుపరి ఆలస్యంగా సుమారు ఏడుగురు అభ్యర్థులు రాగా వారిని అధికారులు, రూట్ ఆఫీసర్ మిర్యాలగూడ రూరల్ ఎస్సై పి. లోకేష్ అనుమతించలేదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద నుంచి వెనక్కి వెళ్లారు.

You may also like

Leave a Comment