సర్పంచ్ నీల కుమారస్వామి..
వీణవంక, జనవరి 26( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని కురుమవాడలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి , జాతీయ గీతాలపన చేశారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి, ఉప సర్పంచ్ భానుచందర్, వార్డు సభ్యులు నీల మొండయ్య,సంపత్,
బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి మహేందర్,నాయకులు అమృత ప్రభాకర్,సాహెబ్ హుస్సేన్,
నీల పున్నం చందర్, జంపయ్య, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ కుల బాంధవులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.