ఘట్కేసర్,డిసెంబర్18(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎదులాబాద్ గ్రామంలో కందుల రాఘవేందర్ ముదిరాజ్ గురు స్వామి అయ్యప్ప స్వామి 18వ మహా పడి పూజ గురు స్వామి బర్ల ఆంజనేయులు ముదిరాజ్ ఆధ్వర్యంలో కనులపండుగగా నిర్వహించారు. పురోహితులు కుమార్ శర్మ గణపతి పూజతో అయ్యప్ప పూజ ప్రారంభించారు.గురు స్వాములు శ్రీను స్వామి,మాచర్ల పాండు స్వాముల పర్యవేక్షణలో పంచామృతాలతో మణికంఠ స్వామివారికి అభిషేకం నిర్వగించారు.
అనంతరం 18 కళశాలకు పూజలు చేసి అనంతరం అయ్యప్ప స్వాములు పేటతుల్లి ఆడుతూ రాగా అయ్యప్పతో పాటు రాఘవేందర్ స్వామికి అభిషేకం చేశారు. అనంతరం అంజి గురుస్వామి రాఘవేందర్ స్వామికి ఉపదేశం చేశారు.అయ్యప్ప ఆభరణాలు తీసుకు వచ్చే గట్టంలో భక్తులు పూనకాలతో ఊగిపోయారు.
ఈ సందర్బంగా తన తల్లి భారతమ్మకు,తన గురువు ఆకిటి సుధాకర్ రెడ్డి కి రాఘవేందర్ దంపతులు పాద పూజ చేశారు..
ఈ సందర్బంగా స్వామి వారి ఆభరణాల పెట్టెలతో స్వాములు ఊరేగింపుగా పూజా ప్రాంగణంలోకి రాగానే భక్తులు పరవశించి పోయారు.శ్రీ ధర్మ శాస్త్ర భజన బృందం వారు పాడిన పాటలకు మహిళలు పూనకాలతో ఊగిపోయారు. పూజా కార్యక్రమం ఆధ్యంతం ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
రాఘవేందర్ కన్నెస్వాములు కార్తీక్,మౌనిక లతో కలిసి 18 మెట్ల పడి వెలిగించారు. భారీగా తరలి వచ్చిన మహిళలు,భక్తులు పూజ అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు.
ఈ పూజ కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


