Home తాజా వార్తలు దండి ఆశ్రమం లో ఘనంగా దత్త జయంతి వేడుకలు

దండి ఆశ్రమం లో ఘనంగా దత్త జయంతి వేడుకలు

by Telangana Express

..బాన్సువాడ డిశంబర్15,.
..తెలం గాణ ఎక్స్ ప్రెస్..

బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామ శివారులో గల కాశీ దండి స్వామిజీ ఆశ్రమం లో ఆదివారం దత్త పౌర్ణమి ని పురస్కరించుకుని దత్త జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆశ్రమ వేద పండితులు జపాల రామారావు శర్మ, జపాల ప్రభాకర్ శర్మ,జపాల పాండురంగ శర్మ,ప్రశాంత్ రావ్ శర్మ,శ్యామ్ సుందర్ శర్మ, దేవదాస్ శర్మ,రాఘవ చారి,శ్రీనివాస చారి అర్చకత్వంలో కాశీ దండి సుదర్శన స్వామిజీ పర్యవేక్షణ లో పోలీస్ వ్యవస్థ విశ్రాంత ఉద్యోగి కోనా రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, పుణ్యాహవాచనము,అంకురార్పణ మహాన్యాసా పూర్వకంగా స్వామివారి కి పంచామృతాభిషేకములు, అలంకరణలు అనంతరం అనఘ దేవి సమేత అనఘ స్వామి వ్రతము నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం, డోలరోహణం ఇత్యాది తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాన్నం భక్తులకు అన్న సమరాధన కార్యక్రమం చేపట్టారు. ఇట్టి కార్యక్రమానికి నియోజకవర్గ పరిధి నలుమూలల నుండి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment