ఎల్లారెడ్డి, డిసెంబర్ 15,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణ శివారులో గల దత్తగిరి ఆశ్రమంలో, ఆదివారం 40 వ వార్షిక దత్త జయంతి వేడుకలను అమ్మ కాశమ్మ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉదయం నుంచి బ్రాహ్మణోత్త ములు శ్రీనివాస్ రావు జోషి పంతులు, బద్రి పంతులుచే ప్రత్యేక పూజలు చేయించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ధ్వజారోహణం, దత్తాత్రేయుని డోలాహరణము, గురుపూజ మరియు అఘోత్తర 128 దీపాలతో , ఆరాధన మంగళహారతి, మహనివేదనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం స్వీకరించారు. దత్త జయంతి వేడుకలకు జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్ హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆ తర్వాత భజన కార్యక్రమాలు రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో దత్తగిరి అశ్రమ నిర్వాహకులు మాణిక్యం మహారాజు కుటుంబీకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

