Home తాజా వార్తలు ఘనంగా శ్రీ దత్త జయంతి వేడుకలు….

ఘనంగా శ్రీ దత్త జయంతి వేడుకలు….

by Telangana Express

ఎల్లారెడ్డి, డిసెంబర్ 14,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో కొలువై ఉన్న దోర్దొండప్ప మహారాజ్ ఆశ్రమంలో ఉన్న దత్త పీఠం లో, శనివారం దత్త జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించినట్లు దత్త పీఠం నిర్వాహకులు శ్రీ క్రాంతి పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి కనుల పండుగగా వందలాది మంది భక్తుల సమక్షంలో వారి వారి గోత్ర నామాదులతో భక్తులందరి చేత సంకల్పం చేయించి, స్వామివారికి శుద్ధోదక అభిషేకం, పంచామృత అభిషేకం, వివిధ రకాల ఫలాలతో ఫలోదక అభిషేకం, స్వామివారికి నూతన పట్టు వస్త్ర సమర్పణ, మహా నైవేద్యం మంత్రపుష్పం నీరాజనం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు ప్రాంతానికి చెందిన తుల్లోరు కృష్ణ ప్రకాష్ భక్తులందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు శ్రీ క్రాంతి పటేల్ తెలిపారు. దత్త జయంతి వేడుకలకు దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు దత్త పీఠం వద్ద భక్తులతో సందడి నెలకొంది. రాత్రి భజన కార్యక్రమాలు జరిగాయి.

You may also like

Leave a Comment