Home తాజా వార్తలు బిచ్కుంద మార్కండేయ మందిరంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

బిచ్కుంద మార్కండేయ మందిరంలో ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

by Telangana Express

బిచ్కుంద ఫిబ్రవరి 12:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ మందిరంలో మార్కండేయ జయంతి వేడుకలను , సోమవారం రోజున మార్కండేయ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో తమ కులదైవమైన మార్కండేయుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు, వేదమంత్రాల ఉచ్చారణతో పూల మాలలు,టెంకాయలు, మంగళ నీరాజనాలు చేసి,మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అష్టాదశ పురాణాల్లో ఒకటి మార్కండేయ పురాణం,శివ భక్తుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మార్కండేయుని పేరు కచ్చితంగా వినిపిస్తుంది. చిన్నారుల్లో దేవుడి పట్ల విశ్వాసాన్ని,కోరికలను నెరవేర్చుకోవడంలో చూపల్సిన పట్టుదలను పెంచేందుకు మార్కండేయుని కథనుఆదర్శంగా చెబుతారు.పూర్వము మృకండుడు అనే ఒక రుషి ఉండేవారు.తాను పరమేశ్వరుని స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటున్న సమయంలో మృగాలు తనని రాసుకుంటూ పోయిన పట్టించుకోకుండా అలాగే ధ్యానంలో మునిగిపోయేవాడట, మృకండునికి మరుద్వతి,అనే సాద్వి భార్యగా ఉండేది. భగవంతుని నామస్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న దంపతులకు ఒక లోటు ఉండేది.వీరికి సంతానం లేకపోవడంతో ఇరువురు కలిసి కాశి క్షేత్రానికి వెళ్లి ఈశ్వరుడిని పూజించడం ప్రారంభించారు.వీరి దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు, మీకు సంతానం కలిగేలా వరం ఇస్తాను.మీకు ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి ఎక్కువ కాలం జీవించే దుష్టుడు కావాలా పదహారేళ్లు జీవించే గుణవంతుడు కావాలా? అని పరమశివుడు అడిగాడు.అప్పుడు వారు మంచి వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే ఏం లాభం,మాకు గుణవంతుడైన అల్పఆయుష్కుడేకావాలి అని కోరుకున్నారు. మృకండుని దంపతులకు అతి తక్కువ సమయంలోనే సంతానం కలిగింది. మృకండుని కుమారుడు కాబట్టి తనకు మార్కండేయుడు,అని నామకరణం చేయడం జరిగింది.శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు మంచి వ్యక్తిత్వం,సకల గుణాలు కలవాడు.బాల్యం ముగియకముందే సకల శాస్త్రాలను ఔపోషణ పట్టాడు. మార్కండేయుడు, వ్యక్తిత్వంలోను తనకు సాటి లేదనిపించుకున్నాడు.ఈ నేపథ్యంలోనే మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే తన ఆయుష్షు తీరనుందని వారికి అర్థమయింది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు.సప్త ఋషులను, మార్కండేయుని చూసిన బ్రహ్మ,తనని నిరంతరం శివుని ఆరాధన చేయమని సూచిస్తాడు. శివనామ స్మరణ చేయడం వల్ల అకాల మరణం సంభవించదని మార్కండేయునికి వివరించారు.ఆ రోజు నుంచి ఒక శివలింగం ముందు కూర్చొని మార్కండేయుడు,శివ ధ్యానం చేయడం ప్రారంభించాడు.ఓవైపు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి. మరోపక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు.అంతేకాదు సమయం దగ్గర పడుతున్న కొద్ది మరింతగా శివ నామస్మరణ జోరు పెరుగుతుంది.అదే సమయంలో యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి యమభటులు బయలుదేరారు.అయితే వారి వల్ల ఆపని కాలేదు కదా,కనీసం మార్కండేయుని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయారు.దీంతో యముడే తనను స్వయంగా తీసుకురావాలని నిర్ణయించుకొని తన వాహనమైన మహిషాని అధిరోహించి, యమపాషాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు వెళ్ళాడు.ఆ ధ్యానాన్ని ఆపి ఇటు వైపు రా! నీకు భూమి మీద సమయం అయిపోయింది,అని హుంకరించాడు యముడు. మార్కండేయుడు యముని మాటలను లెక్కచేయకుండా మరింత గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పటించడం ప్రారంభించాడు. అప్పుడు యముడికి ఏం చేయాలో అర్థం కాలేదు, చివరికి చేసేదేమీ లేక చేతిలో ఉండే పాషాన్ని మార్కండేయుని మీదకు విసిరాడు. మార్కండేయునితో పాటు ఉన్న శివలింగానికి ఆ యమపాశం, తగలగానే శివుడు కాలరుద్రుడై బయటకొచ్చాడు.తన మీదకి,తన భక్తుడి మీదకు పాషాన్ని వదులుతావా అంటూ యముడిని సంవారించాడు.ఆ సందర్భం అనుగుణంగానే శివుడికి కాలాంతకుడు అని కూడా పిలుస్తారు. యముడు లేకపోతే చావు,పుట్టుకల జీవనచక్రం,ముందుకు సాగేదెలా! అందుకే దేవుళ్ళ అందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపజేశాడు. యముడు మార్కండేయుని జోలికి రాకుండా ఉండాలని, శివ భక్తులను నరకానికి తీసుకెళ్లకూడదని యముని హెచ్చరించాడు.ఈ సంఘటన తిరుక్కడయూర్,అనే ప్రాంతంలో జరిగిందని చాలామంది నమ్ముతారు. మార్కండేయుడు, అప్పటినుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా,అష్టాదశ పురాణాల్లో ఒక్కటైన మార్కండేయ పురాణాన్ని రాశారు.అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు మల్లికార్జున అప్ప సెట్ కారు ,ఎంపీపీ అశోక్ పటేల్ జడ్పిటిసి భారతి రాజు స్థానిక ఎంపిటిసి చంద్రకళ రాజు డాక్టర్ బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్ మాజీ జెడ్పిటిసి కమల్ కిషోర్ బట్ట, పద్మశాలి సంఘం అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు బాలకిషన్ భక్తులు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment