బోధన్ రూరల్,డిసెంబర్22:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) బోధన్ పట్టణం సరస్వతి నగర్ లో గురు స్వామి కర్నె శ్రీనివాస్(ఆర్చిటెక్) స్వగృహంలో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయ అర్చకులు సంతోష్ మహారాజ్ మంత్రోచ్ఛారణల మధ్య గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి కి పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, పుష్పార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 18 మెట్లకు కర్పూర హారతులు ఇచ్చి పడి పూజ చేశారు.
