చిగురుమామిడి:జూలై 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
గ్రామ పంచాయతి సిబ్బంది మరియు కారోబార్ బిల్ కలెక్టర్ సమస్యలపై గత 21 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి 51వ జివోను రద్దు చేసి కనీస వేతనం 19500 రూపాయాలు అందరి సిబ్బందికి ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా సిబ్బంది యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని మల్టీ పర్పస్ విధానాన్ని తోలగించి ఏవరి కేటగిరిల వారిగా వారికి హోదాలు కల్పంచాలని ఉద్యోగ భద్రత కల్పించి ప్రమాదవశాత్తు ఎవరయినా మరణించినట్లయితే ప్రభుత్యమే 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి వారి కుటుంబం లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కారోబార్లకు మరియు బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలనీ చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు ప్రభుత్వం గ్రామ పంచాయతి సిబ్బంది సమస్యలు పరిష్కరించే వరకు సమ్మే కొనసాగిస్తామని తెలుపారు ఈ సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతి కరోభార్ సిబ్బంది యూనియన్,
రాష్ట కార్యదర్శి బింగి గణేష్, జిల్లా అధ్యక్షులు మారెల్ల రాజేష్ , మండల అధ్యక్షులు మండల అధ్యక్షుడు వేల్పుల రాములు , కరోభార్లు శంకర చారీ ,శంకర్ బాబు, సాంబయ్య రాజేశం, అనిల్, జయ తదితరులు పాల్గొన్నారు.