Home తాజా వార్తలు కోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

కోటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

by Telangana Express

ప్రజలకు మంచి చేస్తే ప్రతిపక్షాలు చూసి సహించడం లేదు…

కలెక్టర్ పై దాడి అమానుషం…

కీలక వ్యాఖ్యలు చేసిన విప్ అడ్లూరి….

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ నవంబర్ 15

కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రోజున వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం ఆలయ అర్చకులు, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను వారికి అందజేశారు.తదుపరి మండల నాయకులతో కలిసి కోటిలింగాల వద్ద గల బోటింగ్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ
పవిత్ర కార్తీక మాసంలో ఆ దేవ దేవుడైన మహా శివుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజానీకం పైన మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎల్లవేళలా ఉండాలని,ఆ దేవదేవుడి ఆశీస్సులతో విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని,చెప్పారు
కానీ ప్రతిపక్షాలు స్వయంగా సమస్యలను సృష్టించి వాటిని పరిష్కరించాలని అనవసర ఆందోళనలు చేయడం జరుగుతుందని,ఇటీవల జరిగిన కలెక్టర్ పై దాడిలో కూడా ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని,కేసీఆర్ ఒక మాట, కేటీఆర్ ఒక మాట,హరీష్ రావు ఒక మాట,ఈ విధమైన పొంతన లేని విధానాన్ని అవలంబిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బి.ఆర్.ఎస్ పార్టీ చేయడం జరుగుతుందని,కానీ ప్రజలు వారి మాటల్ని నమ్మే స్థితిలో లేరని ఈ సందర్భంగా తెలిపారు..*

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిపర్తి శైలేందర్ రెడ్డి వెల్గటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి శ్రీకాంత్ రావు పూదారి రమేష్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment