ఎల్లారెడ్డి, డిసెంబర్ 29,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బేడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డి పట్టణ 1 వ వార్డు కౌన్సిలర్ అల్లం శ్రీను అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాందీపని కళాశాలలో జరిగిన బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సమావేశానికి ఎల్లారెడ్డి మండలం నుండి అల్లం శ్రీను అధ్వర్యంలో బేడ బుడగ జంగం సంఘ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ 57 ఉపకులాలకు జనాభా దామాషా ప్రకారం అందాలని, ఉప కులాల ప్రతిపాదికన న్యాయం జరగాలంటే ఎస్సీ 57 ఉప కులాల ఐక్యంగా ఉండాలన్నారు. ప్రభుత్వం బేడ బుడగ జంగం సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 57 ఉప కులాలను ఏకం చేసి అందరికీ సమానమైన న్యాయం జరగడానికి ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో 1వ వార్డు కౌన్సిలర్ అల్లం శ్రీను, నాయకులు టేకు రమేష్, కళ్ళెం సాయిలు, అల్లం పండరి , జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
