సద్దుల బతుకమ్మ సంబరాలలో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు
మంచిర్యాల, అక్టోబర్ 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రోడ్డుపై గుర్తుతెలియని కారు వాహనం మోటార్ సైకిల్ పై ఢీకొని బైకుపై వెళ్తున్న సంఘటన జన్నారం మండలం పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సోమవారం రాత్రి అందాజ ఏడు గంటల 30 నిమిషాలకు గుర్తు తెలియని కారు వాహనం చెక్కపల్లి కుంట సమీపంలో ఢీకొనడంతో మోటార్ సైకిల్ పై వస్తున్న పుప్పర్ల గంగన్న తో పాటు ఇద్దరు మైనర్ బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిగా గాయాల బారిన పడిన వారిని అంబులెన్సులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరొకరిని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స జరుగుతూ ఉండగా ఇద్దరు బాలికలు మరణించారని వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరు బాలికలు పొనకల్ గ్రామానికి చెందిన పుప్పర్ల గంగన్న లక్ష్మి దంపతుల మైనర్ బాలిక (15), తరాల్ల సాగర్ జ్యోష్ణ దంపతుల మైనర్ బాలిక (17) గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో పుప్పర్ల గంగన్న మోటారు సైకిల్ పై తన కూతురితో పాటు మరో బాలికను సద్దుల బతుకమ్మ సంబరాలకు వస్తూఉండగా, గుర్తుతెలియని కారు వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. ఇరు కుటుంబాలలో ప్రమాదానికి గురైన బాలికల కోసం కంటతడి పెడుతూ, విలపిస్తూ ఉంటే గ్రామస్తులు కన్నీటి పెట్టుకున్నారు. మండలంలోని పొనకల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ రోజు ప్రమాదం జరిగిన విషయాన్ని గ్రామంలోని ప్రతి ఇంటి మహిళలు సద్దుల బతుకమ్మ రోజు ఇలా ప్రమాదం జరగడంతో కన్నీరు పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకొని, పూర్తి విచారణ చేపట్టి గుర్తుతెలియని కారు వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.
నియోజకవర్గం జన్నారం మండలం పోనకల్ గ్రామంలోని ఇరు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అభ్యర్థి జాక్సన్
మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పోనకల్ గ్రామ చేక్కపల్లి గుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇరు కుటుంబాలను ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య జంక్షన్ నాయక్ పరామర్శించారు. సద్దుల బతుకమ్మ రోజు ప్రమాదానికి కారకులైన దుండగులను చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చౌరస్తాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్థానిక పోలీస్ అధికారులకు తెలియాపస్తామన్నారు. గ్రామంలో ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయడం వల్ల ఇరు వాహనాలు ప్రమాదానికి జరిగిన సమయాన్ని తెలుసుకొని, వెంటనే ప్రమాదానికి గురైన వాహనాన్ని వాహనదారునిపై చర్య తీసుకోవచన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఎర్రచందర శేఖర్, ఎంపీపీ మా దాడి సరోజన, మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, పోనకల్ గ్రామ సర్పంచ్ జక్కు భూమేష్, పోనకల్ గ్రామ అధ్యక్షుడు మర్రిపల్లి అంజయ్య, పట్టణ యూత్ అధ్యక్షుడు పత్తిరి రవీందర్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మున్వర్ అలీ ఖాన్, రాగుల శంకర్, యువశక్తి స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబికుల బాధితులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.