- ఎల్లారెడ్డి ఎంపీడీఓ లక్ష్మి
ఎల్లారెడ్డి, మార్చి 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండల కేంద్రము లోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, మార్చి 15 వ తేది శుక్రవారం నాడు ఉదయం 11.00 గంటలకు ఎల్లారెడ్డి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు, స్థానిక ఎంపిడిఓ లక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగే మండల సర్వ సభ్య సమావేశానికి స్థానిక జడ్పీటిసి సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, సమస్త ఎంపిటిసి సభ్యులు, సమస్త పంచాయతీ ప్రత్యేక అధికారులు , డివిజన్, మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి స్థాయి ప్రగతి నివేదికలతో హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.