వీణవంక, ఫిబ్రవరి 24 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో గొర్రెల పెంపకదారుల సహకార సంఘం నూతన కమిటీ ని శనివారం నియామకం జరిగింది. ఈ కమిటీలో నూతన అధ్యక్షులుగా గెల్లు మల్లయ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా దాసరి రమేష్, కార్యదర్శిగా గెల్లు రాజ్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా దాసరి వీరన్న,గెల్లు రాజయ్య, గెల్లు వనిత,దాసరి శ్యామలను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షులు మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ… గ్రామ గొర్రెల సహకార సంఘఅభివృద్ధికి, సంఘ సభ్యుల సహకారంతో ప్రభుత్వం నుంచి రావలసిన ప్రభుత్వ పథకాలు, గొర్రెల యూనిట్లు,గొర్రెల పెంపకం దారుల అభివృద్ధికి నిత్యం పాటుపడతామని హామీ ఇచ్చారు.గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు, గొర్రెల సహకార సంఘ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.