Home Latest పశువుల వైద్యాధికారి ఆధ్వర్యంలో గేదెలకు ఉచిత వైద్య శిబిరం

పశువుల వైద్యాధికారి ఆధ్వర్యంలో గేదెలకు ఉచిత వైద్య శిబిరం

by Telangana Express

మంచిర్యాల, ఆగస్టు 02, గతెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లె గ్రామంలో మండల పశు వైద్యం పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కస్తూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సోమవారం మండలంలోని చింతల పల్లె గ్రామ పంచాయితీ లో ఆవులు, గేదెలు, దూడలకు ఉచితంగా నట్టల నివారణ మందులు, గాలి కుంటు టీకాలు, ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు వైద్య శిబిరం నిర్వహించి, అన్ని పశువులలో అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందున ముందస్తుగా అన్ని గ్రామాల్లో పశు సంవర్ధక శాఖ ద్వారా ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని గ్రామంలోని పశువులను పెంచుకునే వారు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో పశువులకు వ్యాధి చోకిన, ప్రమాదం జరిగిన కూడా వైద్య అధికారికి ఫోన్ చేయగా అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ రాజన్న, మండల పశు వైద్య పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ శిరీష, సిబ్బంది రెహమాన్, కిషన్, సంజీవ్, సాగర్, వినోద్, ఆదిత్య, గోపాల మిత్ర లు రాజన్న, రమేష్, తదితరులు పాల్గోన్నారు.

You may also like

Leave a Comment