బిచ్కుంద జనవరి 25:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద లైన్స్ క్లబ్ అఫ్ డైమండ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్యులు ఓం ప్రకాష్ 40 మందిని పరీక్షించగా ఎనిమిది మందికి కంటి లోపం ఉందని నిర్ధారించి వారిని బోధన్ లైన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి కి ఆపరేషన్ కొరకు పంపించడం జరిగిందని లైన్స్ క్లబ్ ఆఫ్ బిచ్కుంద డైమండ్ అధ్యక్షులు డాక్టర్ రాజు తెలిపారు. ఈకార్యక్రమంలో జోన్ చైర్ పర్సన్ డాక్టర్ ఓం ప్రకాష్,కార్యదర్శి గోపాల్, డా. రవి, శ్రీధర్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.