Home తాజా వార్తలు జుక్కల్ గ్రామపంచాయతీలో ఉచిత కంటి వైద్య శిబిరం

జుక్కల్ గ్రామపంచాయతీలో ఉచిత కంటి వైద్య శిబిరం

by Telangana Express

జుక్కల్ ఫిబ్రవరి 29;-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మారుమూల ప్రాంతాల్లో సేవలు అందించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320D జోన్ ఛైర్పర్సన్ ఓం ప్రకాశ్ అన్నారు,జుక్కల్ మండల కేంద్రంలోని జుక్కల్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జుక్కల్ వారధి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటుచేయడం జరిగింది అని ,ఈ సందర్బంగా వారధి లయన్స్ క్లబ్ సెక్రెటరీ పాకాలి శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి మోతీ బిందు ఉన్నవారికి ఉచిత వైద్యం కొరకు బోధన్ లయన్స్ క్లబ్ తీస్కొని వెళ్ళి ఉచిత కంటి ఆపరేషన్ చేపిస్తము అని కంటి పరీక్షలు నిర్వహించిన వారికి కళ్ళ డ్రాప్,మాత్రలు ఉచితంగా అందిస్తాము అని తెలియజేశారు, ఈ సందర్భంగా జుక్కల్ సెక్రెటరీ బలరాం నాయక్ ,వారధి లయన్స్ క్లబ్ కోశాధికారి భాను గౌడ్, సభ్యులు మోగులయ్య ,పురుషోత్తం,కార్తిక్ గౌడ్,బాలాజీ,నాగరాజ్,తుకారాం,మనోజ్ ,గ్రామ ప్రజలు,వృద్దులు ,యువకులు ఉన్నారు.

You may also like

Leave a Comment