వీణవంక, జనవరి 13 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల పోలీస్ స్టేషన్ కు ఇటీవలే నూతనంగా బదిలీపై విచ్చేసిన ఎస్సై బి వంశీకృష్ణ ను, శనివారం జిల్లా ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు, ఘన్ముక్ల గ్రామ ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు కాసం వీరారెడ్డి లు,మర్యాదపూర్వకంగా కలుసుకొని, శాలువా కప్పుతూ ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నాగిడి సంజీవరెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కాసం వీరారెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.