Home తాజా వార్తలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ డిసెంబర్ 27

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా వెల్గటూరు మండల కేంద్రంలో అంబేద్కరు విగ్రహం వద్ద శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటనీ,దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావి మన్మోహన్ ని,ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనత వారికే దక్కుతుందని,ఎటువంటివివివాదాలు లేకుండా 10 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసి వివాహ రహితుడగా పేరు పొందారని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాట కూడా శ్రీమతి సోనియా గాంధీ ,మరియు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే సాధ్యం కావడం జరిగిందనీ,కేంద్ర మంత్రిగా వారు చేసిన సేవలు దేశం ఎన్నటికీ మార్చిపోదని,సోనియా గాంధీ కి ప్రధానిగా అవకాశం వచ్చినప్పటికి మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రధాని పదవిని వారికి ఇవ్వడం జరిగిందని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు..
వారి వెంట మండల మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్ మాజీ ఎంపీటీసీ రంగు తిరుపతి మండల బీసీ సెల్ అధ్యక్షులు ఉదయ్ గౌడ్ యూత్ అధ్యక్షులు పూదరి రమేష్ సోషల్ మీడియా ఇన్ఛార్జి గుమ్ముల వెంకటేసు మాజీ జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్రావ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ పోలోజు శ్రీనివాస్ సప్ప లింగయ్య దూడ రవి గ్రామ శాఖ అధ్యక్షులు దుంపట సత్యం జనర్ధన్ నల్ల తిరుపతి కస శ్రీనివాస్ నాయకులు నర్సయ్య తిరుమల్ అజయ్ వేణు సంతోష్ పవన్ మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment