Home తాజా వార్తలు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం అరెస్ట్

మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం అరెస్ట్

by Telangana Express
  • మాగనూరు పాఠశాల ఘటనపై ధర్నా చేస్తారన్న ముందస్తు సమాచారంతో..
  • మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్.
  • మద్దూర్ పోలీస్ స్టేషన్కు తరలింపు

– మక్తల్ పట్టణంలో బిఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, నవంబర్ 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నారాయణ పేట జిల్లా మాగనూరు జెడ్పి హై స్కూల్ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ వరుస సంఘటనలతో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహిస్తారన్న ముందస్తు సమాచారంతో ఉదయం తెల్లవారుజాము నుండే మాజీ ఎమ్మెల్యేతో పాటు అన్ని మండలాలకు సంబంధించిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మద్దూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మక్తల్ లో టిఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి మాజీ ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ చిట్టెం రామ్మోహన్ రెడ్డి నీ వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి డిసిఎంలో పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదే క్రమంలో మాగనూరులో సైతం ఎలాంటి ఆందోళనలకు పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డిఎస్పి లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మొహరింపజేశారు.

You may also like

Leave a Comment