జోగిపేట్ డిసెంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు అయిన వారు సంగారెడ్డి జైల్ నుంచి విడుదల అయిన సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలపడం జరిగింది, మీ పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి సంఘీభావం ప్రకటించారు, అక్రమ కేసులు ఎత్తివేసే వరకు మీతో కలసి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు, బెయిల్ రావడానికి కృషి చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, రాష్ట్ర బిసి కమిషన్ మాజీ సభ్యులు శుభ పద పటేల్, సీనియర్ నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, వెంకన్న, మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాజు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
