బీబీపేట్ ఫిబ్రవరి 2:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )బీబీపేట్ మండల కేంద్రంలోని మార్కండేయ మందిర ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వ సభ్య సమావేశంలో నూతనంగా పట్టణ మహిళా పద్మశాలి సంఘ కార్యవర్గం ఏర్పాటు చేసినట్లు డివిజన్ పద్మశాలి సంఘ అధ్యక్షులు తుమ్మ మచ్చేందర్ ఓ ప్రకటనలో తెలిపారు .పట్టణ మహిళా సంఘ అధ్యక్షరాలులుగా చందుపట్ల జమున ,ఉపాధ్యక్షులుగా తుమ్మ జాన్సీ ,ప్రధాన కార్యదర్శి గా అందే లావణ్య ,కోశాధికారిగా ఆంకాలపు ఉషశ్రీ ,సలహదారులుగా తుమ్మ అఖిల ,సోమ జమున ,బింగి పద్మలను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారని ,కార్యవర్గ సభ్యులుగా గడ్డం లావణ్య ,సింగం జ్యోతి ,చాట్ల జ్యోతి ,,బింగి లావణ్య ,చింతకింది స్వర్ణ ,చందుపట్ల శ్వేత ,మేరుగు ఇందిరా ,దోర్నాల దేవిక ,ఖ్యాతం రూప ,దుడుగు సత్తవ్వలు కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతారని ఆయన వివరించారు ………ఈ సందర్భంగా మచ్చేందర్ మాట్లాడుతూ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే ఉద్దేశ్యంతో వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యవర్గం ఏర్పాటు చేశామన్నారు .మహిళలు రాజకీయ ,ఆర్ధిక రంగాలలో ముందుంటూ గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఎదగాలని ఆయన మహిళలకు పిలుపునిస్తూ సూచించారు .సమావేశం పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు ఆంకాలపు నరేందర్ అధ్యక్షతన నిర్వహించగా ఉపాధ్యక్షులు తుమ్మ రవీందర్ ,ప్రధాన కార్యదర్శి చందుపట్ల పురుషోత్తం ,కార్యవర్గ సభ్యులు ,మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
మహిళా పద్మశాలి సంఘ కార్యవర్గం ఏర్పాటు
120