Home తాజా వార్తలు వెేడ్మా బోజ్జు పటేల్ గెలుపు పట్ల, ఎన్ఎస్ యుఐ, కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ

వెేడ్మా బోజ్జు పటేల్ గెలుపు పట్ల, ఎన్ఎస్ యుఐ, కాంగ్రెస్ నాయకులు భారీ ర్యాలీ

by Telangana Express

మంచిర్యాల, డిసెంబర్ 04, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నిర్మల్ జిల్లా, ఖానాపూర్ లో వేడ్మా బోజ్జు పటేల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఖానాపూర్ నియోజక వర్గం, జన్నారం మండల పట్టణంలో మండల అధ్యక్షుడు ముజ్జు, పట్టణ అధ్యక్షులు దూమాల్ల రమేష్, ఎన్ఎస్ఈఐ, ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రోడ్డు వెంట ఘనంగా ర్యాలీగా వచ్చి డాక్టర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. సోమవారం జరిగిన ర్యాలీలో భాగంగా నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పటేల్ గెలుపు వేడుకల్లో జన్నారం మండల అధ్యక్షుడు, ఎన్ఎస్ఈఐ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వేల మంది కార్యకర్తలతో మెయిన్ రోడ్డు వైపు బొజ్జు పటేల్ గెలుపు సందర్భంగా సంబరాలు చేసుకుంటూ, బానసంచ పేల్చి అధిక సంఖ్యలో జనం వేడుకల్లో పాల్గొన్నారు. కేసిఆర్ అహంకార పూరిత, మోసపూరిత, పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని, దొరల పాలన అంతమై ప్రజల పాలన వచ్చిందని, పలువురు నియోజకవర్గంలోని మండల, గ్రామ ఓటర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గం ఎస్ టి ఏరియా కావడంతో గత రెండుసార్లు రేఖనాయక్ (మహీళ) టిఆర్ఎస్ ప్రభుత్వం గులాబి జెండా ఎగురవేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని మరో ఇతర జిల్లాకు చెందిన వ్యక్తికి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పిపించింది. ఈ నియోజకవర్గంలో లబ్బాడి, గోడ్స్, తెగకు చెందినవారు ఎక్కువగా ఉండడంతో ఏకపక్షంగా సాగిన పోరులో కాంగ్రెస్ పార్టీ వైపే ఖానాపూర్ నియోజకవర్గ వైశామైంది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను రెండు లక్షల రైతు ఋణమాఫిని, వివిధ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఓటర్లు నమ్మి రాష్ట్ర కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, పసివుల్లా, జన్నారం ఎంపిటీసి రియాజోద్దీన్, పంకజ, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడిపల్లి ఇందయ్య, పలువురు నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు, ఎన్ఎస్ యుఐ సోహైల్ షా, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment