Home తాజా వార్తలు కెసిఆర్ జన్మదిన సందర్భంగా శాంతినిలయంలో అన్నదాన కార్యక్రమం

కెసిఆర్ జన్మదిన సందర్భంగా శాంతినిలయంలో అన్నదాన కార్యక్రమం

by Telangana Express

బోనకల్ , ఫిబ్రవరి 17 (తెలంగాణ ఎక్స్ప్రెస్) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70వ పుట్టిన రోజు సందర్భంగా మండల కేంద్రంలో గల శాంతి నిలయంలో గల మానసిక బాలికలకు శనివారం ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఈ సందర్భంగా కమల్ రాజు మాట్లాడుతూ… కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారని ,రాష్ట్రాన్ని సాధించడంతోపాటు రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కెసిఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని కమల్ రాజు కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు మల్లికార్జున రావు, పిఏ నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, వేమూరి ప్రసాదు, పారా ప్రసాదు, బంధం నాగేశ్వరరావు, కాకాని శీను, తన్నీరు పుల్లారావు , ఇటికల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment