అందించిన సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్
భైంసా పట్టణం లోని పలు వివిధ గ్రామాలలో ప్రజలకు
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 21/12/24
ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అందరు బంద్ గ్రామానికి చెందిన ఏట్టపు శోభన్ బాబు గత నాలుగు సంవత్సరాలుగ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ఇట్టి విషయాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ సమత ఫౌండేషన్ సేవలను గుర్తించి సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ కి ఇట్టి విషయాన్ని తెలియజేయడం జరిగింది.వెంటనే స్పందించిన సమత సుదర్శన్ గారు గుడిహత్నూర్ కు వచ్చి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఏట్టపు శోభన్ బాబుని అనారోగ్య పరిస్థితులను తెలుసుకొని రెండు నెలలకు సరిపోయే టాబ్లెట్స్ కొరకు 15 వెయ్యిల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సుగుణక్క మాట్లాడుతూ సమత ఫౌండేషన్ చేసే సేవలను ప్రశంసించడం జరిగింది అలాగే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జ్ ఆత్రం సుగుణ ఇచ్చోడ మండల కన్వీనర్ కరుణాకర్, సమత ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్ రావ్, సీఈఓ అనిల్ కుమార్, పీ ఆర్ వో క్రాంతి కుమార్, సభ్యులు ప్రవీణ్ , తదితరులు పాల్గొన్నారు
