రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్ నాయి
మిర్యాలగూడ నవంబర్ 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుడు మల్లవరపు సత్యనారాయణ పక్షవాతంతో అనారోగ్య కారణంగా షాపు నడపలేనీ పరిస్థితి, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆళ్లగడప గిరిధర్ నాయి సహకారంతో నాయి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు నరసింహ లు కలసి మిర్యాలగూడ పట్టణ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారి సహకారంతో 16,500 రూపాయలను బుధవారం నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఇబ్బందులు కలిగినట్లయితే తమ దృష్టికి తీసుకు వస్తే తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని, నాయి బ్రాహ్మణులు ఐక్యంగా ఉండి ఎవ్వరికీ అయ్యిన ఆపద వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నాయి బ్రాహ్మణు అందరూ కలిసికట్టుగా ఉండాలని సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో కేతపల్లి యాదగిరి,గోలి యాదగిరి, రాచమల్ల పెద్ద వీరయ్య, రాయించు స్వామి, అలుగుబెల్లి వెంకట్, మహేశ్వరపు రవి,ఇటికాలసత్యనారాయణ,నేరేడు కొమ్మ వెంకన్న,మహేశ్వరపు నరేష్, మానియాస్ యాదగిరి, రామకృష్ణ,అశోక్, పట్టణ కార్యదర్శి,కోశాధికారి సైదులు వెంకన్నలు నాయి బ్రాహ్మణ పట్టణ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.