ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మండలంలోని సోమార్ పేట్ గ్రామ రైతులు, శుక్రవారం ఒకే రోజు 79 వ్యవసాయ విద్యుత్ మోటార్ల బిల్లులు వంద శాతం చెల్లించినట్లు ఫోర్ మెన్ గంగాధర్ తెలిపారు. మొత్తం 79 బోర్ మోటార్ల కు సంబంధించిన 35,288 రూపాయల బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ గంగాధర్ తో పాటు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ సిద్దెందర్ రెడ్డి, లైన్ మెన్ బాలకిషన్ గౌడ్, ఏ ఎల్ ఎం ఇస్మాయిల్, సి ఎల్ రియాజ్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.
