– అంబేద్కర్ చౌరస్తా అష్టదిగ్బంధనం చేసిన రైతులు
– ఆరు రోజులైనా టోకెన్లు ఇవ్వని వైనం రాస్తారోకో చేపట్టిన రైతులు,
– అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం విఫలం.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిగాలంటూ టి యు సి ఐ ఆధ్వర్యంలో ధర్నా.
– ఆరు రోజుల క్రితం వర్షంలో తడిసి క్యూలైన్లో నిలబడ్డ టోకన్లు దొరకలేదంటూ రైతుల ఆవేదన.
– తక్షణమే ఎమ్మెల్యే, కలెక్టర్ రావాలంటూ నినాదాలు హోరెత్యాయి
నారాయణపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 16(తెలంగాణ ఎక్స్ ప్రెస్) : గత కొద్ది నెలలుగా యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్న జిల్లా రైతాంగం. టోకెన్లు లభించకపోవడంతో విసిగి వేసారిన రైతన్నలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాను అష్టదిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వారం క్రితం ఒక్క టోకెన్ సంపాదించిన రైతులు కొందరైతే, అసలే టోకెన్లు దొరకక ఆగమాగం అయిన రైతులు మరికొందరు. వెరసి మంగళవారం నాడు ఉదయం అంబేద్కర్ చౌరస్తా ను అష్టదిగ్బంధనం చేసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లాలో గత కొంత రోజులుగా యూరియా కోసం నాన్న అగచాట్లు పడుతున్న రైతులకు సరైన సమయంలో సరిపడా యూరియా కోసం టోకెన్లు ఇవ్వకపోవడంతో పరిపరి విధాలుగా పలుమార్లు రైతులు శోభ పడ్డారు అట్టి రైతులకు ఈనెల 10వ తేదీ నాడు వర్షంలో సైతం తడుస్తూ క్యూ లైన్ లో నిలబడ్డప్పటికీ టోకెన్లు లభించక నానాయాతనపడ్డ రైతులు ఆరు రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో టి యు సి ఐ నాయకులను సంప్రదించి వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తలో నేటి ఉదయం రాస్తారోకోకు పూనుకున్నారు. రైతులకు యూరియా అందించని అసమర్ధ ప్రభుత్వాలు గద్దె దిగాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వం లో ఉన్న నరేంద్ర మోడీ పాలలను ఎండగడుతూ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ స్థానిక ఎమ్మెల్యే విఫలమైందనీ కలెక్టర్ కూడా ఫెయిల్యూర్ అయిందని అన్నారు. రైతుల పక్షాన నిలబడే నాయకులే కరువయ్యారని వైట్ కలర్ లీడర్లకు మాత్రం దొడ్డి దారిన బస్తాలకు బస్తాలు ఇచ్చి పంపించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్టి ధర్నా కార్యక్రమంలో వల్లంపల్లి గ్రామ రైతులు అప్పిరెడ్డిపల్లి గ్రామ రైతులు తమ గోడును వెల్లబుచ్చారు. తక్షణమే ఆయా గ్రామ పంచాయతీ రైతు వేదికల ద్వారా ఆ గ్రామాల రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయాలని కోరారు.



