Home తాజా వార్తలు రైతులు పంట పొలాలకు మోతాదు మించిన నత్రజని ని వాడొద్దు

రైతులు పంట పొలాలకు మోతాదు మించిన నత్రజని ని వాడొద్దు

by Telangana Express

పంట భూములను నిస్సారం చేయ్యేద్దు…

మండల వ్యవసాయ అధికారి గణేష్…

వీణవంక, ఫిబ్రవరి 20 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కోర్కల్ గ్రామ రైతు వేదికలో క్లస్టర్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు మండల వ్యవసాయ అధికారి గణేష్ ఆధ్వర్యంలో పంట పొలాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ…. రైతు సోదరులు పంట పొలాలకు అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల, భూములు నిస్సారంగా మారి, పంట పొలాల్లో వ్యాధుల తీవ్రత పెరుగుతుందని, పంట దిగుబడి తగ్గుతుందని, అంతేకాక
యూరియా మోతాదు వల్ల కాండం తొలిచే అధికమవుతుందని, రైతు సోదరులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, ఎరువుల, పురుగు మందుల వినియోగంపై క్రమశిక్షణ చేపట్టాలని, సందేహాలు, సలహాలు ఉంటే సమీప ఏఈఓ లను, కానీ మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చునని అన్నారు. ఈ అవగాహన సదస్సులో మండల వ్యవసాయ అధికారి గణేష్, ఏఈఓ అచ్యుత్, క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment