పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
రేగోడు మండల వ్యవసాయ అధికారి జావేద్
రేగోడు జులై 26 తెలంగాణ ఎక్స్ ప్రెస్, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అధిక వర్షాల పట్ల రేగోడు మండల రైతాంగం అప్రమత్తంగా ఉండాలని రేగోడు మండల వైద్యాధికారి జావేద్ అన్నారు.ఈ సందర్భంగా బుధవారం నాడు ఫీల్డ్ వర్క్ లో భాగంగా పత్తి చేనులలో తిరిగి రైతులకు తగు సూచనలు చేశారు. అధిక వర్షాలకు పత్తిలో నిలిచిన నీటిని సాధ్యమైనంత తొందరగా తీసివేయాలని. వీలైనంత త్వరగా భూమిలో తేమను |తగ్గించటానికి అంతరకృషి చేయాలనీ, దీని ద్వారా భూమిలో తేమ తగ్గి మొక్కలు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, వర్షాలను ఆసరా చేసుకుని ఎకరాకు భూమిలో 25 కిలోల యారియా,10 కిలోల పొటాష్ ఎరువులను మొక్కకు 5-7 సెంటీమీటర్ల దూరంలో వేసుకోవాలనీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అంతర సేద్యం వీలు కాకపోతే 20-25 రోజుల దశలో క్విజిత్ పాప్ ఇథైల్ 400 మి.లీ. పైరిథియోబాక్ సోడియం 250 మి.లీ కలిపి ఎకరాకు పిచికారి చేయడం ద్వారా గడ్డిజాతి వెడల్పాటి కలుపును నివారించ వచ్చు అని అన్నారు.అధిక వర్షాలకు నల్ల నేలల్లో వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయనీ, అలా ఉంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజిమ్ 1 గ్రాము నీటిలో కలిపి మొక్క మొదళ్ళలో తడపాలనీ, అధిక వర్షాలకు లేత పసుపు రంగుకు మారిన మొక్కలను పోషకాలను ఆకుల ద్వారా 5-10 గ్రాములు లీటరు నీటికి మొక్క వయసును బట్టి పొటాషియం నైట్రేట్ పిచికారీ చేసినట్లయితే మొక్కలు సాధారణ స్థాయికి చేరుతాయని అన్నారు.