Home తాజా వార్తలు రైతు కన్నేర్ర

రైతు కన్నేర్ర

by Telangana Express

– రెండు రోజుల వ్యవధి లోనే  మూడువేల ధర తగ్గింపు.

– ఖరీదు దారుల మాయాజాలం అంటున్న కంది రైతులు.

– పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది రైతుల ఆందోళన.

–  చైర్మన్ ఛాంబర్ లోకి చొరబాటు చైర్మన్ ను నిలదీత.

– పోలీసుల రంగప్రవేశం.

– అట్టుడికిన  మార్కెట్ యార్డ్.

నారాయణపేట జిల్లా, ప్రతినిధి, డిసెంబర్ 16 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): నారాయణపేట జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు రోజుల అనంతరం కంది పంటకు ధర 3000 రూపాయలు తగ్గిపోవడంతో కోపోద్రేకులైన కంది రైతులు. మార్కెట్ చైర్మన్ చాంబర్లోకి దూసుకుపోయి ఆందోళనకు దిగాడం వ్యవసాయ మార్కెట్ యార్డులో కనిపించింది. శుక్రవారం నాటి మార్కెట్లో 11500 పలికిన కంది ధర సోమవారం వచ్చేసరికి 8500 కు తగ్గడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళనకు దిగడం మార్కెట్ యార్డులో కలకలం రేపింది. మధ్యాహ్నము రెండు గంటల వరకు రావాల్సిన టెండర్ 4:30 కు రావడం వెనక ఆంతర్యం ఏమిటోనని ఖరీదుదారులను నిందించారు. పలు అనుమానాలు వ్యక్తం చేసిన రైతులు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డిని ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఏమి జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. రైతుల ఆందోళన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ధరలు పెంచేంతవరకు ఆందోళన విరమించమని భీష్మించుకు కూర్చున్న కంది రైతులు.

You may also like

Leave a Comment