Home తాజా వార్తలు ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు వ్యాయామం తప్పనిసరి. భవిత భవనంలో 9 మంది దివ్యాంగులకు ఫిజియోథెపీ చికిత్సలు ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు వ్యాయామం తప్పనిసరి. భవిత భవనంలో 9 మంది దివ్యాంగులకు ఫిజియోథెపీ చికిత్సలు ఫిజియోథెరపీ వైద్యులు అరుణ్

by Telangana Express

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 22, (తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులకు ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయిస్తే దివ్యాంగుల్లో మార్పు వస్తుందని ఫిజియోథెరపీ వైద్యులు జి. అరుణ్ కుమార్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోనీ స్థానిక భవిత భవనంలో తెలంగాణ సర్వ శిక్షాభియాన్ వారి సహిత విద్యలో భాగంగా ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత ఫిజియోథెరపీ శిబిరంలో దివ్యాంగ చిన్నారులకు ఫిజియోథెరపీ చికిత్సలు అందజేశారు. ఈ సందర్భంగా 9 మంది దివ్యాంగ చిన్నారులకు వారి తల్లితండ్రుల సమక్షంలో చేయించాల్సిన వ్యాయామ పద్ధతులను ఫిజియోథెరపీ వైద్యులు ప్రత్యక్షంగా చేసి చూయించారు. తాను చూపించి చేయించిన విధంగా దివ్యాంగ చిన్నారులకు ఇంటి వద్ద ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా వ్యాయామం చేయించడం ద్వారా దివ్యాంగుల్లో తప్పకుండా మార్పు వస్తుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న ఈ ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ చిన్నారులు ఉన్నటువంటి తల్లితండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల్లో ప్రాథమిక దశలో స్వల్ప వైకల్యాన్ని గుర్తించి నట్లైతే ఫిజియథెరపీ ద్వారా పూర్తిగా నయం చేయవచ్చని అన్నారు. ఈ ఫిజియోథెరపీ శిబిరంలో ఐఈఆర్పి లు వెంకటేష్, శివకుమార్, సిజివి పద్మ తో పాటు దివ్యాంగ చిన్నారుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment