Home తాజా వార్తలు సీసీ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యతగా చేయాలి …ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

సీసీ రోడ్డు నిర్మాణం పనులు నాణ్యతగా చేయాలి …ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జులై 5,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

సీసీ రోడ్డు నిర్మాణం పనులను పది కాలాల పాటు మన్నికగా నిలిచే లా నాణ్యత గ నిర్మించాలని, ఎల్లారెడ్డి ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్, జడ్పీటిసి ఉషా గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని హజీపూర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింది తండాలో స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ కృషితో మంజూరైన 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులను ఎంపిపి, జడ్పీటీసీ ఉషా గౌడ్, సర్పంచ్‌ చాందీబాయి తో కలిసి టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిపి మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టే విధంగా చూడాలని సదరు కాంట్రాక్టర్ కు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లిక, తండా పెద్దలు భీంలా, నర్సింగ్, లక్ష్మణ్, గణేష్ నాయక్, మోతీరం తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment