వీణవంక, నవంబర్ 14 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మంగళవారం రాత్రి యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి తో , బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. రాబోవు అసెంబ్లీ ఎన్నికలు దృష్ట్యా రాజకీయ సమీకరణలపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.. ఇరువురి భేటీ హుజురాబాద్ నియోజకవర్గంలో సర్వత్ర రాజకీయ చర్చనీయఅంశంగా మారింది. ఈ భేటీలో మానకొండూరు బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్, జమ్మికుంట జెడ్పిటిసి శ్రీరాం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.