Home తాజా వార్తలు ఎమ్మార్పిస్ విశ్వరూప మహాసభ ఇంటింటి ప్రచారం

ఎమ్మార్పిస్ విశ్వరూప మహాసభ ఇంటింటి ప్రచారం

by Telangana Express
  • మండల ఇన్చార్జి మణిగిరి క్రిష్ణ ఆధ్వర్యంలో

మాగనూర్ అక్టోబర్ 24:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్):మగనూర్ మండల ఎమ్మార్పీఎస్ పార్టీ ఇంచార్జి మణిగిరి క్రిష్ణ ఆధ్వర్యంలో మాగనూర్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పిస్ నియోజకవర్గ ఇంచార్జి బోడి తేజ మాదిగ మాట్లాడుతూ నవంబర్ 07 న హైదరాబాద్ మహానగరంలో జరుగు విశ్వరూప మహాసభ విజవంతం చేయడానికై నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గనికి తేదీ 30-10-2023 న మందక్రిష్ణ మాదిగ వస్తున్నాడు కావున మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు, వికలాంగుల హక్కుల నాయకులు మహాజన నాయకులు అన్ని రాజకీయ పార్టీల మాదిగ నాయకులు కార్యకర్తలు అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ sc లకు ఏబీసీడీ వర్గీకరణ ఎంత అవసరమో వివరించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బి వెంకటేష్,పి రాజు సర్పంచ్,(మాగనూర్ )బి మారెప్ప వార్డ్ మెంబెర్, డి వాబయ్య వార్డ్ మెంబెర్, వెంకటేష్, వాబయ్య, నరసిహులు, పర్షురామ్, శ్రీకాంత్, లక్ష్మన్, కున్సీ నరసింహ.తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment