- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
ఎల్లారెడ్డి, డిసెంబర్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి ఆలయం అభివృద్ది చేస్తానని, స్థానిక నూతన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం రాత్రి ఎల్లారెడ్డి పట్టణంలోని హరి హర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప సేవాసమితి వారిచే నిర్వహించిన సామూహిక మండల పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అయ్యప్ప స్వామి మూల విరాట్టు విగ్రహానికి ఆలయ పూజారి ఎమ్మెల్యే చే అభిషేకం చేయించారు. ఆతర్వాత ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ, 41 రోజుల మాలధారణ చేసి కఠిన నియమాలతో దీక్ష చేయడం స్వాముల అదృష్టం అని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. తాను కూడా అయ్యప్ప స్వామి భక్తుడిని అని తెలిపారు. అయ్యప్ప స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ తో మాట్లాడి అన్ని రకాలుగా అభివృద్ది చేస్తానని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో , ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిదప ఆలయ కమిటీ తరపున పూజారి ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి మాధవి బాల్ రాజ్ గౌడ్, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వుక్కల్ కర్ రాజేంద్ర నాథ్ గురుస్వామి, మాలాధార గురు స్వాములతో పాటు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపిపి చెన్న లక్ష్మణ్, నాయకులు మంచిర్యాల విద్యాసాగర్, సయ్యద్ ఆరీఫ్, చినబాలి సమెల్, తదితరులు పాల్గొన్నారు.