*బీసీ నేత ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
హుజూర్‌నగర్ డిసెంబర్ 11 (తెలంగాణ ఎక్స్‌ప్రెస్)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 6వ తేదీ నుంచి కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ గణన ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు.
బుధవారం నాడు ఆయన హుజుర్ నగర్ నియోజకవర్గకేంద్రంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో…
1931వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన కుల గణన చివరిదని, అప్పటినుంచి ఎన్నికైన అన్ని ప్రజా ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూ కాలం వెళ్ళబుచ్చారని, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక విధాలుగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంతో పాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వాలు ఇటీవల కాలంలో బీహార్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ బీసీ కుల గణన చేపట్టారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కుల గణన చేయడంహర్షణీయం అని ఆయన అన్నారు
కేంద్ర ప్రభుత్వ0 కూడాస్పందించి 2025 సంవత్సరంలో జరగనున్న జనగణలలో కుల గణన చేపట్టాలని, కులగణన తర్వాత ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో నిధులతో పాటు చట్టసభల్లో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాస్తవానికి భారతదేశంలో 2021 ప్రారంభంలోనే జనగణన చేపట్టాల్సి ఉండగా కోవిడ్ మహమ్మారి విజృంభించడం వల్ల జనగణన వాయిదా వేశారని 2011లో జనగణన చేశారని ఆ తర్వాత మళ్లి జనాభా గణన జరగలేదని వివిధ రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు నిరంతరం జనాభా గణ జరపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టక పోవడం విచారకర ఆయన అన్నారు
ప్రభుత్వాలు ప్రకటించే నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్ని రకాల కాంట్రాక్టు లలో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు
