తిరుమలగిరి, తెలంగాణ ఎక్స్ ప్రెస్, జనవరి 30:
తిరుమలగిరి మండలం నూతన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డిజెఎఫ్) నూతన కార్యవర్గాన్ని డిజెఎఫ్ రాష్ట్ర నాయకులు ఎండి రహమాన్ అలీ ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఎన్నుకోవడం జరిగింది. తిరుమలగిరి మండల గౌరవ అధ్యక్షులు గా ఎస్ కే చాంద్ పాషా, మండల అధ్యక్షునిగా చిలుకల ప్రకాష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బాకీ శ్రీనివాస్, కోశాధికారి నీర్మాల బాలకృష్ణ, ఉపాధ్యక్షులు పోరెళ్ల వెంకన్న , కార్యదర్శి పత్తెపురం విజయ్ , ప్రచార కార్యదర్శి ఉడుగు సుధాకర్, కార్యవర్గ సభ్యులుగా పత్తెపురం రఘు, చాపల నవీన్, ధరవత్ సంతోష్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులు చిలుకల ప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర నాయకులు ఎండి రెహమాన్ అలీ , గౌరవ అధ్యక్షులు చాంద్ పాషా మరియు సహచర డి జె ఎఫ్ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుతు డి జె ఎఫ్ యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
