ఘట్కేసర్, డిసెంబర్ 06(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈస్టువిలే మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ తైక్వాండో టౌర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ 2023-2024 అండర్ 14,17 బాయ్స్,గర్ల్స్ పోటీలు తులసి గార్డెన్ తండూర్ వికారాబాద్ జిల్లాలో జరిగిన పోటీలలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదులాబ్ గ్రామానికి చెందిన సోమాసాని శ్రావ్య గోల్డ్ మెడల్ సాధించగా,కుంచల సాయి ప్రియ సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నారు ,
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ తైక్వాండో యూనియన్ జనరల్ సేకరటరీ కేపీ హనుమంతు (టిటియూ జీఎస్ ), వీరికి శిక్షణ ఇచ్చిన గ్యార నాగరాజు, కోచ్ గ్యార నరేష్ (టిటియూ డబ్ల్యూ పి ) గ్రామానికి చెందిన (చిన్నారులు)విద్యార్థినీలు ఏక కాలంలో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించడం పట్ల వారి తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పతకాలు వచ్చేలా శిక్షణ ఇస్తూ కృషి చేసిన కోచ్ లను అభినందించారు.
తైక్వాండో క్రీడాల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించిన ఎదులాబాద్ చిన్నారులు
59
previous post