జహీరాబాద్లోని బృంగి ఇంటర్నేషనల్ స్కూల్, సామాజిక బాధ్యతలో భాగంగా అనాధ విద్యార్థులకు ఉచిత విద్యను, సెమీ ఆర్ఫన్ విద్యార్థులకు 50% ఫీజు రాయితీని ప్రకటించింది.
పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఆగమ ప్రమీల మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వివరించారు.
ఆధునిక బోధనా పద్ధతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణంతో పాటు క్రీడలు, వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొంది.
ఈ పథకం అమలుకు సహకరించాలని నియోజకవర్గంలోని గ్రామ పెద్దలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులకు పాఠశాల యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. అర్హులైన విద్యార్థుల వివరాలను సేకరించి, అడ్మిషన్ ప్రక్రియలో సహాయం చేయాలని కోరింది.
మరిన్ని వివరాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు 8977769721, 8977769722 నంబర్లలో పాఠశాలను సంప్రదించవచ్చు. ప్రస్తుతం నర్సరీ నుండి 7వ తరగతి వరకు తరగతులు అందుబాటులో ఉన్నాయి. పాఠశాల పస్తాపూర్ క్రాస్ రోడ్, ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఉంది.







