Home తాజా వార్తలు *విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రోటోకాల్ పాటించని విద్యాశాఖ*

*విద్య వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రోటోకాల్ పాటించని విద్యాశాఖ*

by Telangana Express

– సీఎం ఏ ఆర్ ఆర్, పేట జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ల ఫోటోలు లేకుండా ఫ్లెక్సీ  ప్రోటోకాల్ ను పాటించని విద్యాశాఖ.!?

– సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

– అదనపు కలెక్టర్ బెన్ శాలెం కు కంప్లైంట్ చేసిన పట్టణ అధ్యక్షుడు సలీం.

నారాయణపేట జిల్లా ప్రతినిధి జనవరి 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన జిల్లాస్థాయి ఇన్స్పైర్, విద్య వైజ్ఞానిక ప్రదర్శన 2024 సంబంధించిన వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా చేపట్టవలసిన ప్రదర్శన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సంతాప రోజులు ఉన్నందువలన వాయిదా పడి నూతన సంవత్సరం 2025, 3 4 తేదీల్లో జరపతలపెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేట జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీల ఫోటోలు ముద్రించకుండా అవమానపరిచారనీ, దీనికి తోడు రెండు యూనియన్లైన  పిఆర్టియు, తపస్ యూనియన్ల ఫ్లెక్సీల్లో కూడా ఇవే తప్పులు దొర్లాయని, ప్రదర్శన స్థలంలో ఫ్లెక్సీ ని  ఏర్పాటు చేసి ఉండగా స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు గుర్తించి నాయకులకు సమాచారం ఇవ్వగా పట్టణ అధ్యక్షుడు సలీం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి పిఏ మాధవరెడ్డి పలువురు చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలకు చేరుకొని వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులను నిలదీయగా, పొరపాటు జరిగిందని అట్టి ఫ్లెక్సీ తొలగించి మరో ఫ్లెక్సీని తయారు చేయించి ముఖ్యమంత్రి తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీల ఫోటోలు ముద్రింప చేయిస్తామని అన్నట్టు తెలిపారు.  విద్యాశాఖ అధికారి గోవిందరాజులు ను ఇట్టి విషయంపై వివరణ కోరిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ విషయం నాకు తెలియదు విషయాన్ని తెలుసుకొని సరి చేస్తామని అన్నట్టు సమాధానమిచ్చరని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపాయి. ఇట్టి విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ బెన్ శాలం కు విద్యాశాఖ అధికారులపై, దీనికి సంబంధించిన అందరిపై, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

You may also like

Leave a Comment