Home తాజా వార్తలు ఆర్థిక సంస్కరణల అధ్యుడు మన్మోహన్ సింగ్…

ఆర్థిక సంస్కరణల అధ్యుడు మన్మోహన్ సింగ్…

by Telangana Express
     - ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా 

ఎల్లారెడ్డి, డిసెంబర్ 27,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేసిన సంస్కరణల ఆద్యులు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అని, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. శనివారం డిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్ కు, శుక్రవారం మండలంలోని సోమార్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పెద్దలు, మాజీ పాలక వర్గ సభ్యులతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ దేశంలోని గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని సంస్కర ణవాది , అన్నిటికంటే మించి మానవతావాది అని ఆయన మృతి చెందడం బాధాకరమని అన్నారు. ధర్మానికి ప్రతీకగా నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నవ భారత నిర్మాణంలో తనదైన పాత్ర పోషించారన్నారు. ప్రఖ్యత ఆర్థికవేత్త రాజనీతిజ్ఞుడు భారత దేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమార్ పేట్ గ్రామ కమిటీ అధ్యక్షుడు క్యాస కిష్టయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, మాజీ సర్పంచ్ భర్త పాపయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, సాయిలు, పోశెట్టి, సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment