ఎల్లారెడ్డి, డిసెంబర్ 13,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
మున్సిపల్ మెప్మా ఆర్పిల వేతనాలు పెంచాలని, డ్రెస్ కోడ్, ఐడి కార్డులు కావాలని డిమాండ్ చేస్తూ , శుక్రవారం హైద్రాబాద్ లో మెప్మా ఆర్పి లు చేసిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లకుండా, ఎల్లారెడ్డి మున్సిపల్ మెప్మా అర్పిలు అమృత, సౌజన్యల ను స్థానిక పోలీసులు ఉదయం ముందస్తు గా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు.
