మిర్యాలగూడ జనవరి 8 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణ శివారు
ధనుర్మాస వేడుకల్లో రైల్వే కాలనీ శ్రీ సాయి దత్త ఆశ్రమంలోని శ్రీ అష్టలక్ష్మి మందిరంలో బుధవారం
మంగళ శాసన పాశురం వేడుకలు జరిపారు. మహిళలు హారతులతో తరలివచ్చి ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి పూజలు చేశారు. పట్నం పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి తిరుప్పావై పారాయణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు ప్రతాప్ ప్రధాన కార్యదర్శి నరేందర్. కోశాధికారి మట్టయ్య జానకి రాముడు శ్రీనివాస బాబు, విక్రమ్, పద్మ భవాని కళ్యాణి సుకన్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

