మిర్యాలగూడ అక్టోబర్ 25 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ రెడ్డికాలనీలోని బాలాజీ రెసిడెన్సి లో శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అపార్ట్మెంట్ అధ్యక్షులు మా శెట్టి శ్రీనివాస్( డైమండ్) ఆధ్వర్యంలో 16వ శరన్నవరాత్రి ఉత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు సామూహికంగా దుర్గామాత పూజలు నిర్వహించి అమ్మవారికి రకరకాల నైవేద్యంలు సమర్పించి ప్రసాదాలు పంపిణీ చేశారు.సోమవారం దుర్గా నవమి రోజున అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహించి, అమ్మవారి కృపను పొందుతూ వచ్చే ఏడాది కూడా ఇలాగే పూజలు ఘనంగా నిర్వహించినట్లు, ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందేలా అమ్మవారు కరుణించాలని దుర్గామాతను వేడుకున్నట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.అమ్మవారి తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలను అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరు చేయూతనందిస్తూ ఘనంగా నిర్వహించినందుకు అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
