మంచిర్యాల జులై 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో బుధవారం రాత్రి సమయంలో దంచి కొట్టిన వానల కారణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. ప్రభుత్వ ఆసుపత్రి రక్త పరీక్ష గదిలోకి వరద నీరు ప్రవేశించింది. ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన మహిళల గదులలోకి వరద నీరు చేరుకుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ నాయక్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు వరద నీరు బయటకు వెళ్లే విధంగా చూడాలని ఇకముందు ఆసుపత్రిలోకి వరద నీరు రాకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల బెడ్ కిందకు వరద నీరు రావడం వలన గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోగులతో ఉంటున్న బంధువులు వారికి సహకరించలేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద నీరు రాకుండా చూసుకోవాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో జిల్లా పట్టణ కేంద్రంలోని అధిక వర్షపాతం నమోదు కావడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
దంచి కొట్టిన వానలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరిన వరద నీరు
16
previous post