మిర్యాలగూడ నవంబర్ నవంబర్ 6 తెలంగాణ ఎక్స్ ప్రెస్: KNM ప్రభుత్వ డిగ్రీ కళాశాల మిర్యాలగూడలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ వన్ టు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు . కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ గారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారతీయ న్యాయవాది, ఆర్థిక వేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అయిన డా .BR అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష కృషి చేసి రాజ్యాంగం ను రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ ఈ.రామ్ రెడ్డి యన్ యస్ యస్ యూనిట్ వన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యన్.కోటయ్య , యన్ యస్ యస్ యూనిట్ టు ప్రోగ్రామ్ ఆఫీసర్ జె నరేందర్ రెడ్డి బోధన ,బోధనేతర సిబ్బంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
కె యన్ యమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ వర్ధంతి
59
previous post