కృష్ణ . అక్టోబర్ 24:– (తెలంగాణ ఎక్స్ ప్రెస్) మండలం హిందూపూర్ గ్రామంలో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పిస్ నియోజకవర్గ ఇంచార్జి బోడి తేజ మాదిగ మాట్లాడుతూ నవంబర్ 07 న హైదరాబాద్ మహానగరంలో జరుగు విశ్వరూప మహాసభ విజవంతం చేయడానికై నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గనికి తేదీ 30-10-2023 న మందక్రిష్ణ మాదిగ వస్తున్నాడు. కావున మాదిగ, మాదిగ ఉప కులాల నాయకులు, వికలాంగుల హక్కుల నాయకులు మహాజన నాయకులు అన్ని రాజకీయ పార్టీల మాదిగ నాయకులు కార్యకర్తలు అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ ఎస్.సి,లకు ఏబీసీడీ వర్గీకరణ ఎంత అవసరమో వివరించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బి వెంకటేష్, హిందూపూర్ గ్రామ నాయకులు పరశురాము,శంకర్, శిద్దు మారెప్ప .తదితరులు పాల్గొన్నారు.
హిందూపూర్ లో ఎమ్మార్పిస్ విశ్వరూప మహాసభ ఇంటింటిప్రచారం
45
previous post